భారీ వర్షాలు వరదల ప్రవాహాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
మదనపల్లె డిఎస్పి మహేంద్ర.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు మండలం సోంపల్లి పంచాయతీ కోనేటివారిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు. శనివారం ఉదయం మదనపల్లె డిఎస్పి మహేంద్ర పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను కోరారు. వరద ప్రవాహాల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు . సీఐ.వెంకటేశులు ,ఎస్ఐ నరసింహుడు పాల్గొన్నారు.