రాప్తాడు: కల్తీ మద్యం వ్యాపారం చేస్తుంది టిడిపి నేతలే..శారద నగర్ లో YSR యువజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధారెడ్డి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ లో గురువారం 12:30 గంటల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేత రమేష్ గౌడ్ నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధారెడ్డి రావడం జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది టిడిపి ఎమ్మెల్యేలు వారి అనుచరులే అన్నారు మొలకలచెరువులో కల్తీ మద్యం పట్టుకుంటే ఎక్స్చేంజి పోలీసుల ను బదిలీ చేసిన ప్రభుత్వమని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధారెడ్డి విమర్శించారు.