అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కాలువ పల్లి వద్ద చీర కొంగు ద్విచక్ర వాహనం టైర్ కు చుట్టుకుని ప్రమాదవశాత్తు కింద పడి వివాహిత మృతి
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని బెల్గుప్ప మండలం కాలువ పల్లి వద్ద జాతీయ రహదారిపై చీర కొంగు ద్విచక్ర వాహనంలోని టైర్ కు చుట్టుకుని ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లో నుంచి పడి కుందుర్పి మండలం తేనెగల్లు గ్రామానికి చెందిన జయ శ్రీ అనే వివాహిత మృతి చెందింది. దీంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.