ఒంగోలు అర్బన్: చట్టసభల్లో మహిళలు రిజర్వేషన్ ప్రవేశపెట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ లక్ష్మి, వైసిపి పై ఆగ్రహం
Ongole Urban, Prakasam | May 30, 2026
మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీర్మానం చేసిన సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంటే.. కొందరు అధికారంలో లేకపోయినా ఇంకా రప్పా రప్పా అంటూ తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. బాధ్యత మరిచి అసెంబ్లీకి వెళ్లకుండా బయట ధర్నాలు చేస్తున్నారని, వారు పదవులకు రాజీనామా చేయాలని ఫైర్ అయ్యారు.