ఉరవకొండ: పట్టణంలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ప్రారంభం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఎస్.కె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏపీ స్కూల్ గేమ్స్ మండల స్థాయి పోటీలను అధికారులు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్కే పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఈశ్వరప్ప, ఎంపీడీవో రవి ప్రసాద్, వెలిగొండ ఉన్నత పాఠశాల హెచ్ఎం నారాయణస్వామి మండల లోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ లో మొదటి రోజు షటిల్, బ్యాట్మింటన్ , యోగా, చెస్, కోకో, కబడ్డీ లలో ప్రతిభను చూపిన క్రీడాకారులను డివిజనల్ లెవెల్ పోటీల్లో పాల్గొంటారని ఎంఈఓ పేర్కొన్నారు.