గుంతకల్లు: గుత్తి పట్టణంలో దసరా పండుగ సందడి, ప్రజలతో కిక్కిరిసిన మార్కెట్లు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దసరా పండుగ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. పండుగ వస్తువులు కొనుగోలు కోసం ప్రజలు రావడంతో బుధవారం సాయంత్రం జనాలతో కిక్కిరిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు భారీగా మార్కెట్ కు తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. అందరూ ఒకే సారి రావడంతో పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అదే మార్కెట్ లో వ్యాపారులు పూలు, పండ్లు, ఇతర వస్తువుల ధరలను భారీగా పెంచేశారు. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది.