హుకుంపేట మండలం బూర్జ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని భారీ ధర్నా చేపట్టిన ఆదివాసీలు
హుకుంపేట మండలం బూర్జ గ్రామం వద్ద చేపట్టనున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలని ఆదివాసీలు పెద్ద ఎత్తున సోమవారం ఆందోళనకు దిగారు. సీపీఎం పార్టీ నాయకులతో కలసి గిరిజనులు సోమవారం మధ్యాహ్నం రాళ్లగెడ్డ నుంచి తహశీల్దార్. కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం హుకుంపేటలో ఈ మేరకు భారీ ఎత్తున ధర్నా చేశారు ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 51 ని రద్దు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆదివాసిలు ఈ సందర్భంగా హెచ్చరించారు