అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి నేతలు రైతులతో కలిసి గొల్లపల్లి 44 జాతీయ రహదారి వద్ద పీఏబీఆర్ కుడికాలువను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గొల్లపల్లి వద్ద పరిశీలించడం జరిగిందని అయితే నీటి సామర్థ్యం మూడు అడుగులు మాత్రమే ఉందని ఇందువల్ల చివరి చెరువుకు నీరు చేరడంలో ఆలస్యం అవుతుందని నీటి సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు స్థానిక రైతులు పాల్గొన్నారు.