ఆళ్లగడ్డ: చిగురించిన అహోబిలం నల్లమల పచ్చదనంతో కనువిందు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మొన్నటి వరకు మండే ఎండలతో మోడు బారిన నల్లమల అడవి ప్రాంతం ఇటీవల కురిసిన వర్షాలతో మళ్ళీ పచ్చదనాన్ని సంతరించుకుంది, ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎగువ దిగువ అహోబిల క్షేత్రానికి వెళ్లే రహదారుల వెంట చెట్లు చిగురించి, పచ్చగా కళకళలాడుతూ ప్రయాణికులను కనువిందు చేస్తున్నాయి, ఈ నల్లమల ప్రకృతి అందాలను తినిపిస్తూ పర్యావరణ ప్రేమికులు అహోబిలం వచ్చే భక్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు