ఒంగోలు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Apr 22, 2026
ఒంగోలు నియోజకవర్గంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.19 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దామచర్ల వెల్లడించారు. సంబంధిత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే జనార్దన్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.