రాయచోటి పట్టణంలో భారీ స్థాయిలో ప్రత్యేక పోలీసు చర్యలు
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.వి. చలపతి నేతృత్వంలో పోలీసులు పట్టణంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.బస్టాండ్ ఏరియా,టన సర్కిల్, బంగ్లా సర్కిల్, గాంధీ బజార్, కంసల వీధి పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాల రద్దీని సక్రమంగా నియంత్రించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.అలాగే పట్టణంలోని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా గాంజా సేవనానికి పాల్పడుతున్న అనుమానితులపై దృష్టి సారించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు.