అనంతపురం అర్బన్: ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి కార్మికుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తుగా కిందపడడంతో సెంట్రింగ్ పనులు చేసుకునే భరత్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.