నంద్యాల అర్బన్: జాతీయ హాకీ జట్టుకు నంద్యాలకు చెందిన భార్గవి ఎంపిక
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని భార్గవి అండర్-21 జాతీయ హాకీ జట్టుకు ఎంపికయ్యారు. పులివెందుల సౌత్ జోన్ పోటీల్లో ప్రతిభచాటడం ద్వారా ఆమె ఈ అవకాశం దక్కించుకున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. త్వరలో పూణేలో జరిగే జాతీయ పోటీల్లో భార్గవి పాల్గొంటారు. క్రీడలతో పాటు చదువులోనూ ఆమె టాపర్గా రాణించడం విశేషం. కళాశాల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.