పెద్దవూర: నాగార్జునసాగర్ డ్యాం కు భారీగా వరద 18 గేట్లు ఎత్తిన అధికారులు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వర్గ ప్రవాహం భారీగా వస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 588.10 అడుగుల నీటిమట్టం నమోదయిందన్నారు. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేశారు .జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.