ఉరవకొండ: దుద్దేకుంట గ్రామంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుక
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామంలో బుధవారం రాత్రి శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి జయంతి వేడుక లో భాగంగా వాల్మీకి సోదరీమణులు బోనాలను సమర్పించారు. గ్రామంలో వాల్మీకి చిత్రపటంతో గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుద్దే కుంట గ్రామ వాల్మీకి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుక కార్యక్రమంలో గ్రామ వాల్మీకి కుటుంబాల నుండి సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా గ్రామోత్సవం నిర్వహించారు.