విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని గుంతకల్లు పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం నియోజకవర్గ పోలింగ్ బూత్ విభాగం అధ్యక్షుడు మౌలా, మాజీ మునిసిపల్ చైర్మన్ రామాంజనేయులు జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పోలింగ్ బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు మౌలా మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్లు చైర్మన్ సీటును ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని కోరారు. పట్టణంలో 45 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారని అన్నారు.