ఒంగోలు అర్బన్: మీకోసంలో అర్జీదారులు తమ అర్జీల స్టేటస్ను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి వినియోగించుకోండి: జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 12, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు సమర్పించిన అర్జీదారులు తమ అర్జీల స్టేటస్ను తెలుసుకొని తగిన పరిష్కారాన్ని పొందగలరని జిల్లా కలెక్టర్ రాజాబాబు కోరారు ఆదివారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించిన సమాచారాన్ని 1100 నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్ ను కూడా వినియోగించుకోవచ్చు అని తెలిపారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు