బనగానపల్లె: మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండాలి :కొలిమిగుండ్ల ఎంఈఓ అబ్దుల్ కలాం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉండాలని కొలిమిగుండ్ల ఎంఈవో అబ్దుల్ కలాం సూచించారు. శుక్రవారం కొలిమిగుండ్లలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు శిక్షణా కార్య క్రమాన్ని నిర్వహించారు. మెనూ తప్పక పాటించాలని సూచించారు. వంట మహిళలకు పోటీలు నిర్వహించి, రుచికరంగా ఉన్న భోజనాలు ఎంపిక చేసి బహుమతులు అందించారు.