బాల్కొండ: భీంగల్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు
భీమగల్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక అలంకరణ చేసి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తి మార్గం ప్రాముఖ్యతను వివరించారు.