డోన్: ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవు :డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 18, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయం సిబ్బందికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు. జూలై మొదటి వారం నుంచి ఎవరైనా వ్యాపారులు ప్లాస్టిక్ను ఉపయోగిస్తే వారికి జరిమానా విధించి చర్యలు చేపడతామన్నారు. పాత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మార్చడం జరుగుతుందని, అలాగే ఆగస్టు నుంచి గోరుకల్లు రిజర్వాయర్ నీటిని ప్రతి గ్రామానికి అందిస్తామన్నారు