కర్నూలు: రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి
వాతావరణ శాఖ వారి సూచనల మేరకు రాగల నాలుగు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు, కలెక్టరు డాక్టర్ ఎ.శిరి మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, పంట మరియు ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యముగా వ్యవసాయ, ఉద్యానవన మరియు నీటి పారుదల శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు తగు జాగ్రతలు చెబుతూ పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.