డోన్: డోన్ లో ద్రోణాచార్య నగరవణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 1, 2026 నంద్యాల జిల్లా డోన్లో ద్రోణాచార్య నగరవనం బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి హాజరై నగరవనాన్ని ప్రారంభించి పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నగరవనాలను ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ద్రోణాచలం నగరవనం ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.