తుంగతుర్తి: తుంగతుర్తిలో జోరు వానలో బతుకమ్మ సంబురాలు
ఐదు రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన తుంగతుర్తి ప్రజలకు ఆదివారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ, మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో" అంటూ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.