పుంగనూరు: వైసీపీ మండల అధ్యక్షుని భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించిన.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు విజయభాస్కర్ రెడ్డి, ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన భౌతికాయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప,ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.