బనగానపల్లె: బనగానపల్లెలో మెగా రక్తదాన శిబిరం
రక్త కొరత అధిగమించడానికి ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనిని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాతలు అందించే రక్తం మరొకరి ప్రాణాలు నిలబెడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని కోరారు.