కడప: ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే "స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్" కార్యక్రమం ను విజయవంతం చేయాలి: జేసీ అదితి
Kadapa, YSR | Sep 15, 2025 ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగబోయే "స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్" కార్యక్రమం ను విజయవంతం గా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమ న్వయం తో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని బోర్డ్ రూమ్ నందు ఈ నెల 17 వ తేదీ నుండి అక్టోబర్ 2 తేదీ వరకు జరిగే స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం అమలు కు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమా వేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.