రాజేంద్రనగర్: ఆకుల మైలారం గ్రామంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఆకులమైలారం గ్రామంలో గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. మండలంలో జరుగుతున్న చోరీలు, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, ఆన్లైన్ గేమ్‌లు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. అలాగే, ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదని ఆయన హెచ్చరించారు.