అచ్యుతాపురంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారి విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.