జన్మనిస్తూ ఏ తల్లీ మరణించరాదని, గర్భవతి సమయంలో అందించ వలసిన అన్ని రకాల వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాధికారులు సకాలంలో అందించి మాతృ మరణాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన మాతృ మరణాల పై ఎండిఆర్ (మెటర్నల్ డెత్ రెవ్యూ) కమిటీ సమావేశం నిర్వహించి జిల్లాలో ఈ సంవత్సరం గత ఆరు నెలల కాలంలో జరిగిన మాతృ మరణాల పై సమీక్షించారు. ఆరు నెలల కాలంలో ముగ్గురు గర్భవతులు మృతి చెందినట్లు అధికారులు వివరించారు.