ఆళ్లగడ్డ: ఉద్యోగం రాలేదని రైలు కిందపడి కాకరవాడ గ్రామానికి చెందిన యువకుడు మృతి
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకర వాడకు చెందిన తిమ్మిగాళ్ళ శేఖర్ కుమారుడు సుమంత్ రైలు కిందపడి మృతి చెందాడు, కొంతకాలంగా ఆర్మీ కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు, రెండుసార్లు పరీక్షలు రాసిన ఉద్యోగం రాలేదని, మనస్థాపం చెంది పుచ్చకాయల పల్లె సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు, నంద్యాల రైల్వే పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు