తాడ్వాయి: విమోచన దినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ, మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో శబరిమాత ఆలయం నుండి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బైక్ ర్యాలీ ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ గా బయలుదేరి తాడ్వాయి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద జాతీయజెండ ఎగురవేసి,నరేంద్ర మోడీ జన్మదినము సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి మెగ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.