కొల్లూరులో అరవింద వారధి సమీపంలో కృష్ణ నది కట్టకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్
Vemuru, Bapatla | Sep 14, 2025 బాపట్ల జిల్లా కొల్లూరులో అరవింద వారధి సమీపంలో కృష్ణానది కట్టకు గండిపడిన ప్రాంతాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వర్షాల సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తుతే ప్రజలు అధికారులకు వెంటనే సమాచారం ఇస్తే సహాయక చర్యలు చేపడతామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.