అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం స్థానిక శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సామూహికంగా సంకష్టహర చతుర్థి పూజా కార్యక్రమాలను భక్తజనం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు స్వామి ఆలయంలో స్వామివారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకాలు అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సంకష్టహర చతుర్థి వ్రత పూజల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద దాతలు తీర్థ ప్రసాద కార్యక్రమాలను సేవా కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించారు. తదనంతరం ఆలయంలో భజన కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు.