ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఘనంగా స్వామివారి చక్ర స్నానం మహోత్సవం
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో స్వామివారి కల్యాణోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి చక్రస్నానం మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ మేరకు వాడపల్లి గ్రామంలోని గోదావరి నది వద్దకు స్వామివారిని ఆలయం నుండి భారీ ఊరేగింపుగా ఆలయ అధికారులు, భక్తులు తీసుకువెళ్లి ఈ చక్రస్నానం మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలు నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చక్ర స్నానాన్ని చేయించారు