తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. వేడుకకు ముందు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.