అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం సీమగంటి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. తూరు మామిడి గ్రామానికి చెందిన బుచ్చన్న దొర తమ బంధువుల ఇంట్లో అంత్యక్రియలు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా సీమ గండి వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. బైక్ పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, బుచ్చన్న దొర స్పాట్ లో చనిపోయినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కి తరలించామని చెప్పారు.