మైదుకూరు మున్సిపాలిటీ, మండలంలోని నాయి బ్రాహ్మణులు బుధవారం మైదుకూరులో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో కొందరు ఇతర కులస్తులు హెయిర్ కటింగ్ సెలూన్లు ప్రారంభించి, యూపీ రాష్ట్రానికి చెందిన వారితో సేవలు చేయించుకోవడంపై వారు నిరసన తెలిపారు. “మా కడుపు కొట్టొద్దు” అంటూ నినాదాలు చేశారు. అనంతరం మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సమర్పించారు.