అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని బీపీసీఎల్ డిపో ఎదుట బైక్ అదుపు తప్పి బోల్తా పడి రాజేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి చెందిన రాజేష్ జొన్నగిరి సమీపంలోని జియో మైసూరు వజ్రాల కంపెనీలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఆదివారం కంపెనీ పని మీద గుత్తి పట్టణానికి వస్తుండగా బీపీసీఎల్ కంపెనీ ఎదురుగా వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.