గుంటూరు: ద్వావిశంతి (22 వ) శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవ బ్రోచర్ ను ఆవిష్కరించిన పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి
Guntur, Guntur | Sep 20, 2025 గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఈ నెల 22 వ తేదీ నుండి వచ్చే నెల 2 వ తేదీ వరకు ద్వావిశంతి (22 వ) శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. శనివారం ఉదయం చుట్టుగుంట సెంటర్లోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల బ్రోచర్ ను ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆవిష్కరించారు. అనంతరం మీడియా ఆమె మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ పాల్గొన్నారు