ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య, కుటుంబ సభ్యుల అనుమానంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | May 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం కొత్తపట్నం వెళ్లిన ఆ యువకుడు.. తన అమ్మమ్మ ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.