ఒంగోలు అర్బన్: మాజీ సీఎం జగన్ మహిళలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించారని ఒంగోలులో మహిళా వైసిపి నాయకులు వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 17, 2026
వైసిపి మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిందని ఒంగోలు వైసిపి మహిళా నాయకులు మీడియాతో తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చట్టసభలలో మహిళల రిజర్వేషన్ బిల్లు పెట్టడంపై వైసిపి మహిళా నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ స్థానిక ఎన్నికలతో పాటు ప్రతి అంశంలో కల్పించారన్నారు. హోం మినిస్టర్లను డిప్యూటీ సీఎంలను మహిళలను పెట్టిన ఘనత జగన్ కి దక్కుతుందని జగన్ని చూసి హోం మంత్రి పదవిని అనితకు ఓటమి ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.