ఏటూరునాగారం: ఏటూరునాగారంలో ప్రారంభమైన డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు
ఏటూరునాగారం కొమురం భీమ్ స్టేడియంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. సిఐ సూర్యప్రకాష్ ఈ పోటీలను ప్రారంభించగా, యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.