బనగానపల్లె: బనగానపల్లె మండలంలోని యాగంటి రహదారి పనులతో ప్రయాణికులకు ఇక్కట్లు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి రహదారి నిర్మాణ పనుల వల్ల రైతులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధుకొట్టం నుంచి యాగంటిపల్లె మధ్య వాహనాలను పంట పొలాల్లోకి మళ్లించడంతో బస్సులు, ట్రాక్టర్లు నిత్యం ఇరుక్కుపోతున్నాయి. అటు దుమ్ము ధూళితో, ఇటు ప్రమాదకర ప్రయాణంతో యాత్రికులు నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారి పనులను వేగవంతం చేసి తమ కష్టాలు తీర్చాలని రైతులు, భక్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు