ఒంగోలు అర్బన్: నిబంధనలు అధిక్రమించిన పెట్రోల్ బంకుల పై చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 27, 2026
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసినట్లు సోమవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. జిల్లాలో ఉన్న డీజిల్ పెట్రోల్ కొరతను అధిగమించేందుకు పోలీస్ రెవిన్యూ యంత్రాంగంతో ప్రత్యేకమైన నిగా ఏర్పాటు చేయడమే కాకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు డీజిల్ పెట్రోల్ కొరత ఎక్కడా లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన తెలియజేశారు. అవసరమైన ఏందన్న నిలువులో ఉన్నాయని ఎవరు అధైర్య పడవద్దు అని తెలియజేశారు