కర్నూలు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారు: వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం అనేక పోరాడిన వ్యక్తి, విద్య వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి గా ఆయన చేసిన సేవల వల్ల చాలా మంది వెనుకబడి వారు విద్యావంతులు గా తీర్చిందిన వ్యక్తి అబుల్ కలామ్ ఆజాద్ అని ఆయన కొనియాడారు. దేశానికి ఆయన సేవలు మరువలేనివి ఆయన తెలిపారు.