ముమ్మిడివరం మండలంలో ఎండ తీవ్రతకి రహదారులు నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. మండలంలో ఎండ తీవ్రత రోజుకి అంతకంతకు పెరుగుతుంది. ప్రజలు ఎండలకు భయపడి ఇంటి నుండి కాలు బయట పెట్టని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రహదారులన్నీ నిర్మానుస్యంగా మారాయి. ఏప్రిల్ నెలలోనే ఇంతగా ఎండలో కాస్తుంటే మే మరియు జూన్ నెలలలో మరింత ఎండలు కాసే అవకాశం ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.