ఆళ్లగడ్డ: పని ఒత్తిడి కారణంగా ఆళ్లగడ్డ సచివాలయ వీఆర్వో ఆత్మహత్యాయత్నం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలోని సచివాలయంలో విలేజ్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వెంకటపతి శనివారం సాయంత్రం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు, ఉద్యోగరీత్యా అధికారుల పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా నని బాధితుడు తెలిపాడు, కుటుంబ సభ్యుల వెంటనే ఆయనను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు