బోయిన్‌పల్లి: మండల కేంద్రంలో సిడిపిఓ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం వేడుకలు సామూహిక సీమంతాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలంలోని రెండవ అంగన్వాడి సెంటర్లో,బుధవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాలకు సిడిపిఓ సౌందర్య ఆధ్వర్యంలో పోషణ మాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భం గా సామూహిక సీమంతాలు అన్నప్రాసన వంటి సాంప్రదా య కార్యక్రమాలు నిర్వహించారు,పోషణ అభియాన్ ల క్ష్యాలను వివరిస్తూ గర్భిణీలు బాలింతలు చిన్నారుల పోషకాహారం ప్రాముఖ్యతను సిడిపిఓ వివరించి తెలియ జేశారు,తల్లి శిశు ఆరోగ్యం మెరుగుపరచడంలో అందరి పాత్ర ముఖ్యమైందని సూచించారు,కార్యక్రమంలో సూపర్వైజర్లు,ఆరోగ్య పర్యవేక్షకులు,అంగన్వాడీ టీచర్లు, స్థానిక మహిళలు,గర్భిణీలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు,