నందికోట్కూరు: గుడిపాడులో ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్న : సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని కూలీలకు కుటుంబానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి పనుల దగ్గర గతంలో కూలీలకు మజ్జిగ,మెడికల్ కిట్లు,నీడలో కూర్చోవడానికి టార్పాలిన్ పట్టా ఉండేవని ఇప్పుడు అలాంటివి ఏమీ లేవని మండిపడ్డారు.వేసవి అలవెన్స్,పనిముట్లు,కనీస వసతులు లేవన్నారు.కూలీలతో మాట్లాడి వ