నిజామాబాద్ సౌత్: కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. గౌరీ మాతకు, బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నారు.